సోమవారం (23-01-2012) ఉదయం మరణించారు. లింగాయతులైన వారిని తత్సాంప్రదాయాల ప్రకారంగా కూర్చున్న
స్థితి (posture - భంగిమ) లోనే సోమవారం సాయంత్రమే బన్‌సీలాల్‌పేట (సికిందరాబాదు) స్మశానవాటికలో ఖననం
చేసినట్లు తెలుస్తున్నది. వారి మృతిపట్ల మేము తెలుగు జాతి ఐక్యతావేదిక తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుతూ, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. స్వాతంత్య్రసమరయోధుడు, రాష్ట్ర మాజీ మంత్రి, అలనాటి 'విశాలాంధ్ర మహాసభ'లో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ ఎంఎస్ రాజలింగం గారు సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం అని విశాలాంధ్ర మహాసభ వారుకూడ ప్రకటన చేసారు.
No comments:
Post a Comment