Friday, February 7, 2014

Mandumula Narsing Rao's Presidential Address to Andhra Mahasabha

Posting again:

http://telugujativedika.blogspot.in/2011/09/blog-post.html


ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!

ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!

శ్రీ 
మందుముల నర్శింగరావుఅధ్యక్షుడు
 అధ్యక్షోపన్యాసమునుండి

 వుద్యమముయొక్క విస్తీర్ణత,విశాలతనుగురించి విమర్శించుసందర్భములోవిమర్శకుడుతెలంగానోద్యమము అనుటకు మారుగాఆంధ్రోద్యమమను పేరిట ఎందుకువ్యవహరింపబడవలయుననిప్రశ్నించవచ్చును విమర్శకుడు తెలంగానాఅను పేరును అనుశృతిగా వినుచున్నందునఇట్టి ప్రశ్న సవ్యముగా అగుపడుచున్నది. ప్రశ్నకు సమాధానము చెప్పెదను. "ఆంధ్ర"అను పదము చాల పురాతనమైనది.ఋగ్వేదములోకూడ వాడబడినదివింధ్యపర్వతములకు దక్షిణ దిగ్భాగములోనివసించుచుండిన జాతుల ప్రశంససందర్భములో ఆంధ్రుల ప్రశంసకూడవచ్చినది ప్రదేశమునకు ఆర్యులుదండకారణ్యమనియురాకపోకల సౌలభ్యములేక అరణ్యప్రదేశమైనందున అంధకారప్రదేశమనియుయీ భాగములోనివసించుచున్నవారిని ఆంధ్రులనియువ్యవహరించిరని చరిత్రకారులుచెప్పుచున్నారుహైందవుల పవిత్రమైనపురాణములగు రామాయణభారతాదులలోకూడ ఆంధ్రుల ప్రశంస వచ్చినది.
వేదకాలములోపురాణ కాలములోయీదండకారణ్య ప్రదేశములో నివసించువారునాగరికత లేని జాతివారో ఏమోకానిఅశోకసార్వభౌముని కాలములోమాత్రముఆంధ్రులుమహోన్నత నాగరికత జెందినట్లు చరిత్రవుద్ఘోషించుచున్నదిఅశోకునిపితామహుడునుమౌర్యవంశమూలపురుషుడునగుచంద్రగుప్తునిదర్బారునందుండిన మెగాస్తనీస్‌ వ్రాసినవ్రాతలవల్ల ఆంధ్ర సామ్రాజ్యమునకు ముప్పదిదుర్గములులక్ష పదాతులురెండువేల అశ్వదళముఒక వేయి ఏనుంగులు వున్నట్లుతెలియుచున్నది.
అశోక మహారాజు కాలధర్మము నొందినఅచిరకాలములోనే ఉత్తర హిందూస్తానములోమౌర్యవంశము అంతమొందినదిఅప్పుడుదక్షిణ హిందూస్తానములో ఆంధ్ర సామ్రాజ్యమువిజృంభించినది సామ్రాజ్యము తూర్పుసముద్రమునుండి పశ్చిమ సముద్రమువరకువ్యాపించినాలుగు వందలసంవత్సరములవరకు దక్షిణహిందూస్తానమునేకాకఉత్తరహిందూస్తానములో పెద్ద భాగమును తనపరిపాలనలో యిమిడ్చుకొనినదికాలమున దక్షిణ హిందూస్తానము మహోన్నతఅభ్యుదయము గాంచినదిసముద్రము దాటినప్రదేశములతో వర్తక వ్యాపార సంబంధముకలిగించుకొనుటతో ఆంధ్రులకు ప్రత్యేక విశేషతకలిగినదిఆంధ్రులు ఓడల నిర్మాణములోను,వానిని నడిపించుటలోను ప్రఖ్యాతి బడసిరి.అప్పటి చరిత్రకారులు వ్రాసిన వ్రాతలవల్ల దక్షిణహిందూస్తానము లోని యీ ఆంధ్రులే క్రీ. శ. లోపూర్వద్వీపములకు వలసపోయి,యావద్భారతదేశమునకై మార్గదర్శులైమలయాజావాసుమత్రాబర్మాసియాంమరియు ఇండోచైనాలో స్థిరనివాసమేర్పరచుకొని భారతీయ సభ్యతభారతీయసాహిత్యముచిత్రకళలు మున్నగువానినిఆయాప్రదేశమలలో వ్యాపింప జేసిరి.
మహాశయులారాపురాతన చారిత్రకగాథలతో తమ కాలయాపనము చేయనుద్దేశించలేదుకాని పూర్వమొకసారి ఆంధ్రదేశముతో వ్యవహరింపబడుచున్న దేశముతెలంగానా [గాఎట్లు పరివర్తనము పొందినదోచెప్పదలచినానుచంద్రవంశరాజగుకళింగరాజు యీ దేశమునకు రాజుకావడముతోనే [యిదికళింగ దేశమనివ్యవహరింపబడుచు వచ్చెనుక్రమక్రమేణ'కళింగము' 'త్రికళింగముగావ్యవహరింపబడెనుత్రికళింగము మారిత్రిలింగమైనదని చరిత్రకారులు చెప్పుదురు.చాళుక్యులకాకతీయుల నాటి చారిత్రకనిదర్శనములవల్ల త్రిలింగ దేశమనివాడబడినట్లు తెలియుచున్నదిఇట్లు ఆంధ్రదేశముత్రిలింగ దేశముపర్యాయపదములుగా వ్యవహరించబడుచువచ్చెనుఆంధ్ర పండితులఅభిప్రాయముప్రకారము త్రిలింగములగుశ్రీశైలముభీమేశ్వరము (లేకద్రాక్షారామము), కాళేశ్వరముల లోని మధ్యప్రదేశము త్రిలింగ దేశమని తెలియుచున్నది. ప్రదేశము యొక్క జనుల భాష తెలుగుభాష ఆధారమున తెలుగు దేశమైనదికానతెలుగు దేశముఆంధ్ర దేశము ఏకార్థమునుతెలుపునవి. "తెనుగు" "ఆంధ్రముపర్యాయపదములు – తెనుగు పండితులు గ్రాంథికభాషలో "ఆంధ్రపదము వుపయోగపరచితే,సామాన్యులు వ్యవహారిక భాషలో "తెనుగు"పదము ఉపయోగించుచుందురుతెనుగు,ఆంధ్రము – తెనుగు దేశముఆంధ్రదేశములను పదములలో వ్యత్యాసముఏమియు లేదు ఉద్యమమునకు జాతి,సంతతిమతములతో సంబంధము లేదుదేశముననే జనించిఇక్కడనేజీవనోపాయముల సంపాదించుకొనితుదకుయిక్కడనే మృతి నొందనున్న వారైనందునవారందరు ఆంధ్రులేవంగదేశములోనుండువారు వంగీయులుసింధుదేశములోనుండువారు సైంధవులుపాంచాలదేశములోనుండువారు పాంచాలీయులని అనుట లేదా?అటులనే ఆంధ్రదేశములో నుండువారినిఆంధ్రులనుటలో దోషమేమిఆంధ్రులనిఉచ్చరించినమాత్రమున భయమొందుటఎందులకు యుద్యమము పవిత్రమైన ఒకసూబాకు సంబంధించిన ఉద్యమముసూబాలోనివసించు యావన్మానవకోటి అభ్యుదయమునకై యేర్పడినది.