Posting again:
http://telugujativedika.blogspot.in/2011/09/blog-post.html
http://telugujativedika.blogspot.in/2011/09/blog-post.html
ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!
ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!
శ్రీ
మందుముల నర్శింగరావు: అధ్యక్షుడు
అధ్యక్షోపన్యాసమునుండి
ఈ వుద్యమముయొక్క విస్తీర్ణత,విశాలతనుగురించి విమర్శించుసందర్భములో, విమర్శకుడుతెలంగానోద్యమము అనుటకు మారుగాఆంధ్రోద్యమమను పేరిట ఎందుకువ్యవహరింపబడవలయుననిప్రశ్నించవచ్చును. ఈ విమర్శకుడు తెలంగానాఅను పేరును అనుశృతిగా వినుచున్నందునఇట్టి ప్రశ్న సవ్యముగా అగుపడుచున్నది. ఈప్రశ్నకు సమాధానము చెప్పెదను. "ఆంధ్ర"అను పదము చాల పురాతనమైనది.ఋగ్వేదములోకూడ వాడబడినది. వింధ్యపర్వతములకు దక్షిణ దిగ్భాగములోనివసించుచుండిన జాతుల ప్రశంససందర్భములో ఆంధ్రుల ప్రశంసకూడవచ్చినది. ఈ ప్రదేశమునకు ఆర్యులుదండకారణ్యమనియు, రాకపోకల సౌలభ్యములేక అరణ్యప్రదేశమైనందున అంధకారప్రదేశమనియు, యీ భాగములోనివసించుచున్నవారిని ఆంధ్రులనియువ్యవహరించిరని చరిత్రకారులుచెప్పుచున్నారు. హైందవుల పవిత్రమైనపురాణములగు రామాయణ, భారతాదులలోకూడ ఆంధ్రుల ప్రశంస వచ్చినది.
వేదకాలములో, పురాణ కాలములో, యీదండకారణ్య ప్రదేశములో నివసించువారునాగరికత లేని జాతివారో ఏమో? కాని, అశోకసార్వభౌముని కాలములోమాత్రము, ఆంధ్రులుమహోన్నత నాగరికత జెందినట్లు చరిత్రవుద్ఘోషించుచున్నది. అశోకునిపితామహుడును, మౌర్యవంశమూలపురుషుడునగు, చంద్రగుప్తునిదర్బారునందుండిన మెగాస్తనీస్ వ్రాసినవ్రాతలవల్ల ఆంధ్ర సామ్రాజ్యమునకు ముప్పదిదుర్గములు, లక్ష పదాతులు, రెండువేల అశ్వదళము, ఒక వేయి ఏనుంగులు వున్నట్లుతెలియుచున్నది.
అశోక మహారాజు కాలధర్మము నొందినఅచిరకాలములోనే ఉత్తర హిందూస్తానములోమౌర్యవంశము అంతమొందినది. అప్పుడుదక్షిణ హిందూస్తానములో ఆంధ్ర సామ్రాజ్యమువిజృంభించినది. ఈ సామ్రాజ్యము తూర్పుసముద్రమునుండి పశ్చిమ సముద్రమువరకువ్యాపించి, నాలుగు వందలసంవత్సరములవరకు దక్షిణహిందూస్తానమునేకాక, ఉత్తరహిందూస్తానములో పెద్ద భాగమును తనపరిపాలనలో యిమిడ్చుకొనినది. ఆకాలమున దక్షిణ హిందూస్తానము మహోన్నతఅభ్యుదయము గాంచినది. సముద్రము దాటినప్రదేశములతో వర్తక వ్యాపార సంబంధముకలిగించుకొనుటతో ఆంధ్రులకు ప్రత్యేక విశేషతకలిగినది. ఆంధ్రులు ఓడల నిర్మాణములోను,వానిని నడిపించుటలోను ప్రఖ్యాతి బడసిరి.అప్పటి చరిత్రకారులు వ్రాసిన వ్రాతలవల్ల దక్షిణహిందూస్తానము లోని యీ ఆంధ్రులే క్రీ. శ. లోపూర్వద్వీపములకు వలసపోయి,యావద్భారతదేశమునకై మార్గదర్శులైమలయా, జావా, సుమత్రా, బర్మా, సియాంమరియు ఇండోచైనాలో స్థిరనివాసమేర్పరచుకొని భారతీయ సభ్యత, భారతీయసాహిత్యము, చిత్రకళలు మున్నగువానినిఆయాప్రదేశమలలో వ్యాపింప జేసిరి.
మహాశయులారా! పురాతన చారిత్రకగాథలతో తమ కాలయాపనము చేయనుద్దేశించలేదు. కాని పూర్వమొకసారి ఆంధ్రదేశముతో వ్యవహరింపబడుచున్న దేశముతెలంగానా [గా] ఎట్లు పరివర్తనము పొందినదోచెప్పదలచినాను. చంద్రవంశరాజగుకళింగరాజు యీ దేశమునకు రాజుకావడముతోనే [యిది] కళింగ దేశమనివ్యవహరింపబడుచు వచ్చెను. క్రమక్రమేణ'కళింగము' 'త్రికళింగము' గావ్యవహరింపబడెను. త్రికళింగము మారిత్రిలింగమైనదని చరిత్రకారులు చెప్పుదురు.చాళుక్యుల, కాకతీయుల నాటి చారిత్రకనిదర్శనములవల్ల త్రిలింగ దేశమనివాడబడినట్లు తెలియుచున్నది. ఇట్లు ఆంధ్రదేశము, త్రిలింగ దేశముపర్యాయపదములుగా వ్యవహరించబడుచువచ్చెను. ఆంధ్ర పండితులఅభిప్రాయముప్రకారము త్రిలింగములగుశ్రీశైలము, భీమేశ్వరము (లేకద్రాక్షారామము), కాళేశ్వరముల లోని మధ్యప్రదేశము త్రిలింగ దేశమని తెలియుచున్నది.ఈ ప్రదేశము యొక్క జనుల భాష తెలుగు. ఈభాష ఆధారమున తెలుగు దేశమైనది. కానతెలుగు దేశము, ఆంధ్ర దేశము ఏకార్థమునుతెలుపునవి. "తెనుగు" "ఆంధ్రము" పర్యాయపదములు – తెనుగు పండితులు గ్రాంథికభాషలో "ఆంధ్ర" పదము వుపయోగపరచితే,సామాన్యులు వ్యవహారిక భాషలో "తెనుగు"పదము ఉపయోగించుచుందురు. తెనుగు,ఆంధ్రము – తెనుగు దేశము, ఆంధ్రదేశములను పదములలో వ్యత్యాసముఏమియు లేదు. ఈ ఉద్యమమునకు జాతి,సంతతి, మతములతో సంబంధము లేదు. ఈదేశముననే జనించి, ఇక్కడనేజీవనోపాయముల సంపాదించుకొని, తుదకుయిక్కడనే మృతి నొందనున్న వారైనందునవారందరు ఆంధ్రులే. వంగదేశములోనుండువారు వంగీయులు, సింధుదేశములోనుండువారు సైంధవులు, పాంచాలదేశములోనుండువారు పాంచాలీయులని అనుట లేదా?అటులనే ఆంధ్రదేశములో నుండువారినిఆంధ్రులనుటలో దోషమేమి? ఆంధ్రులనిఉచ్చరించినమాత్రమున భయమొందుటఎందులకు? ఈ యుద్యమము పవిత్రమైన ఒకసూబాకు సంబంధించిన ఉద్యమము. సూబాలోనివసించు యావన్మానవకోటి అభ్యుదయమునకై యేర్పడినది.
ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!
ReplyDeleteఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!
ఆరవ ఆంధ్ర మహాసభ: నిజామాబాదు: 3వ బహమన్ 1349 సాయంత్రం
శ్రీ మందుముల నర్శింగరావు: అధ్యక్షుడు
అధ్యక్షోపన్యాసమునుండి 3వ బహమన్ 1349 సాయంత్రం