Thursday, February 26, 2015

భర్తృహరి సుభాషితము



శ్రీరస్తు
భర్తృహరి సుభాషితము
నీతి శతకము
* * *
శ్లో. దిక్కాలాద్యనవచ్ఛిన్నా న న్తచిన్మాత్రమూర్తయే,
న్వానుభూత్యేకమాన్జాయ నమ: శాన్తాయ తేజసే.
క. అచ్ఛము దిక్కాలాద్యన
వచ్ఛిన్నానంతచిద్ధ్రు * నఘవంబు నిజ
స్వచ్ఛానుభూతిమానము
నచ్ఛాంతము తేజ మే న * జస్రము దలంతున్
తా. దేశకాలపరిమితిలేక జ్ఞానమాత్రస్వరూపమై అనుభవముచేతనే ఎరుంగదగినదై కాంతమైన జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మకు నమస్కారము.
* * *
- మూర్ఖ పద్ధతి -
1. శ్లో. బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయదూషితా:
అబోధోపహతా శ్చాన్యే జీర్ణమంగే సుభాషితం.
1. తే. బోద్ధలగువారు మత్సర * పూర్ణమతులు
ప్రబలగర్వవిదూషితుల్ * ప్రభువులెన్న
నితరమనుజు లబోధో * పహతులు గాన
భావమున జీర్ణ మయ్యె సు * భాషితంబు.
తా. తెలిసినవారలు అసూయతో నున్నారు. ప్రభువులు గర్వాంధులు. సామాన్యులకు వినునంతటి తెలివిలేదు. కావున నేను చెప్పదలిచిన సుభాషితము నాయందే అణగిపోయినది.
* * *
2. శ్లో. అజ్ఞ: సుఖమారాధ్య స్సుఖతర మారాధ్యతే విశేషజ్ఞ:
జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి.
2. క. తెలియని మనుజుని సుఖముగ
దెలుపన్ దగు సుఖతరముగ * దెలుపగవచ్చున్
దెలిసినవానిం దెలిసియు
దెలియని నరు దెల్ప బ్రహ్మ * దేవుని వశమే.
తా. తెలియనివానికి సులభముగ దెలియజేయవచ్చును. చక్కగ దెలిసినవానికి సమాధానము చెప్పుట మరింత సులభము. స్వల్పజ్ఞానము గలిగి సర్వజ్ఞుడనని గర్వపడువానిని సృష్టికర్తయగు బ్రహ్మయు రంజింపజేయనేరడు.
* * *
(to be continued)


<iframe src='https://archive.org/stream/bhartriharisubha00bharsher?ui=embed#mode/1up' width='480px' height='430px' frameborder='0' ></iframe>

https://archive.org/stream/bhartriharisubha00bharsher 

No comments:

Post a Comment