Friday, September 6, 2013

Kaloji's poem praising formation of Andhra Pradesh and Telugu unity before he became a separatist since 1969

Our Facebook friend Mr. Ramana Murthy Kappagantu V. has brought to light this poem of late Sri Kaloji Narayana Rao, the famous people's poet of Telangana, written in praise of Andhra Pradesh. It is to be noted that only since 1969 Kaloji became a stubborn [kattar] separatist but before that he was an integrationist and especially during 1955-56 he was a veera vishalaandhravadi [ a zealous protagonist of Greater Andhra]:


Ramana Murthy Kappagantu V శ్రీ కాళోజీ నారాయణరావు ప్రముఖ కవి. ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును, తెలుగు కీర్తిని, పొట్టి శ్రీరాములు గారి గొప్పతనాన్ని తన కవిత రూపంలో చెప్పియున్నారు. 1984లొ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖ ప్రచురించిన “ గేయాంజలి ” అనే కవితా సంపుటిలో ఈ కవిత 46, 47 పుటలలో ప్రచురితమైనది. నేటి రాజకీయాలు, ప్రచార మాధ్యమాలు ఊదరగొడుతున్న ఉప ప్రాంతీయ వాదానికి తెర తీసి భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలను మమైకం చేయవలసిన అవసరం ఉంది. మరుగున పడిన కొన్నింటిని వెలికి తీయటమే నా భావన అని మిత్రులు గుర్తించగలరు.
  • - కప్పగంతు వెంకట రమణమూర్తి ________________________________________

    ఆంధ్రావతరణం
    - శ్రీ కాళోజీ నారాయణరావు

    ఏ మానందము - ఏ మానందము
    ఏ మానందము ఈనాడు
    ఇంటా బైటా - ఎటు చూచిన అటు
    ఎంతో సంబర మీనాడు

    నవ్య తేజములు - నానా శోభలు
    నవాంబరంబున ఈనాడు
    ఏడులు పూడులు - ఎదురు చూచిన
    ఇష్టుల కూటమి - ఈనాడు

    అందరి పాలిటి - అమర తరువుగా
    ఆంద్ర ప్రదేశము ఈనాడు
    అవతరించినది - అవతరించినది
    అవతరించినది ఈనాడు
    గట్టి గుండె గల - పొట్టి రాములు
    పెట్టిన భిక్షగ ఈనాడు

    తెలుగు నాడులో - వెలుగుల పండుగ
    తెచ్చెను కానుక - ఈనాడు
    అమర జీవునకు - ఆత్మానందము
    అంబర వీధిని - ఈనాడు

    భారత భారతి - బహు రూపమ్ముల
    ప్రాభవ మందగా ఈనాడు
    భారత మంతట - ప్రాంత ప్రాంతమున
    భాషకు పట్టము ఈనాడు

    ప్రజామోదము - బ్రహ్మానందము
    భారతి " శ్రీమతి ", ఈనాడు
    తెలుగు వెలుగుతో - వెలుగు పులుగులకు
    వలచిన ఆమని - ఈనాడు

    చెలిమి కలిమితో - వలచిన రీతిగ -
    బలగము పెరిగెను - ఈనాడు
    ముక్కోటి ఆంధ్రులు - మొక్కులు చెల్లగ
    ఒక్కటై ఆంధ్రము ఈనాడు

    సామరస్యము - సంఘీభావము
    సహజీవనము - ఈనాడు
    నెయ్యము వేళల కయ్యము వలదని
    తియ్యని మాటల ఈనాడు

    కాళోజీ కవి - గంటము రాల్చిన
    కవితా సుమములు - ఈనాడు
    * * *

No comments:

Post a Comment