Tuesday, August 16, 2011

Garimella's songs and poems - maa koddi tella doratanamu, and a few others.

మాకొద్దీ తెల్ల దొరతనము!

పల్లవి: మా కొద్దీ తెల్ల దొరతనము దేవ
మా కొద్దీ తెల్ల
దొరతనము

అనుపల్లవి: మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించె //మాకొద్దీ//

చరణములు

1. పన్నెండు దేశాలు పండుచున్నాగాని
పట్టెడన్నమె లోపమండి/
ఉప్పు ! ముట్టుకుంటే దోషమండి!
నోట
మట్టికొట్టి పోతాడండి!
అయ్యొ! కుక్కలతో పోరాడి
కూడు తింటామండీ //మాకొద్దీ//

2. వర్తకంబునకొచ్చి పట్టణంబుల పట్టి రాజ్య మొక్కటి అల్లినాడు
దాన్ని
రాణి కప్పగించినాడు!
రాణి
పత్రమ్ము చించేసినాడు!
ఈ చిత్రమిదేమన్న
శిక్షిస్తానంటాడు //మాకొద్దీ//

3. కోర్టులంటూ పెట్టి పార్టీలు పుట్టించి
స్నేహభావము చంపినాడు
ద్రవ్య
దాహము కల్పించినాడు!
చెడ్డ
యూహలు కడు పెంచినాడు
మా
ఆహారముల ద్రుంచి ఆహా! యనిపించినాడు //మాకొద్దీ//

4. ప్రజల క్షేమంకోసం- పెట్టిన సంస్థలు ప్రభులకోసం
మార్చేస్తాడు
వాటి
ప్రజల శత్రులు చేసుతాడు!
మమ్ము
గజిబిజి లాడ చేస్తాడు
వాడి
గడబిడ వర్ణింపకాదు బ్రహ్మ కైన //మాకొద్దీ//

5. నూటనలుబదినాల్గు నోటికి తగిలించి మాటలాడ వద్దంటాడు!
మమ్ము
పాట పాడ వద్దంటాడు!
తనను
దాటి వెళ్ళవద్దంటాడు!
అయ్యొ
చేటు తెచ్చుకొ మమ్ము చెడిపోవమంటాడు //మాకొద్దీ//

6. ఘోర శాసనాలు కూడదీసి మాదు సారములెల్ల పీల్చాడు!
సంసారము లెల్ల
కూల్చాడు!
మా చీరలనెల్ల
వొల్చాడు!
బంగారములెల్ల
దోచాడు!
వాడు
ధనవంతులనుబట్టి (తైతక్కలాడ్తాడు) దడదడలాడ్తాడు //మాకొద్దీ//

7. ధనముకోసం వాడు దారిచేసికొని కల్లుసారా యమ్ముతాడు!
మాదు
ముల్లె మూటలు దోచినాడు!
ఆలి
మెళ్లో పుస్తెలు త్రెంచినాడు!
మాదు
కళ్ళల్లొ దుమ్మేసి కాటికి దరిచేస్తాడు //మాకొద్దీ//

8. పంటపోయిన గాని పన్నులు విడువక
వెంట కరణాలంపుతాడు
వారి
వెంట తహశీల్దార్నంపుతాడు!
లే కుంటే ఉద్యోగం తీస్తాడు!
మా ఇంటిలోపల
యిట్లు యిడుమల్లు పెడుతాడు //మాకొద్దీ//

9. ఏడాది కేడాది కెక్కువ సిస్తేసి ఈ భూమి నాదే నన్నాడు
మమ్ము కూలికి దున్నుమన్నాడు
కడుపు మంటతో చావ
మన్నాడు
అయ్యొ బానిసలకు వాడు
ప్రభువౌతనన్నాడు //మాకొద్దీ//

10. స్వరాజ్యమందిరస్థాపితమైనట్టి జండాలన్నియు పీకుతాడు
దేశం ముండా మొయ్యమంటాడు
వాడు
బండతనము చూపుతాడు
ఈ ఛండాలపు వృత్తి
స్వీకరించెను నేడు //మాకొద్దీ//

11. దండు పట్టుకవచ్చి తగుదునమ్మా యంచు
దార్ల
వెంబడి త్రిప్పుతాడు!
జాక్
జెండా మీది కెత్తుతాడు
దానికి దండం పెట్టమంటాడు
వాడి గుండుబలం క్రింద
కూల రమ్మంటాడు //మాకొద్దీ//

12. మాదు నెయ్యము చెడగొట్టుతాడు
సేన
కయ్యొ పాపము గట్టుతాడు
అయ్యొ వెయ్యేల
! పోలీసు విధులు మరిపిస్తాడు //మాకొద్దీ//

13. గాంధీటోపీ పెట్టి పాఠశాలకు బోవరావద్దు రావద్దంటాడు!
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు
టోపీ తీసి వీపుల
బాదుతాడు
వాడి రాజద్రోహమంత
రాట్నములో ఉన్నదట //మాకొద్దీ//

14. నూరుమంది మలబారు వాసులను కూరినాడొక పెట్టెలోన
నోట నీరు పోయడు, దేవు నాన!
గాలి దూరనీయడించుకైన
వాడి దారుణత్వమెట్లు తరిమివైతువొ దేవ //మాకొద్దీ//

15. ప్రభువు గాంధితోడ భారత దేశమాత
పరమ తపము చేసినాది
ధర్మదేవత
ప్రత్యక్షమైనాది
కోరిన
వరము లిస్తానన్నాది!
ఆ దొరల
గుండెలలోనదడదడ పుట్టింది //మాకొద్దీ//

16. చూడియావుల కడుపు వేడివేడి మాంసం
వాడికి బహు యిష్టమంట
మాదు పాడి పశువుల కోస్తాడంట!
మా మతము పాడు చేస్తాడంట!
మా చూడి యావుల మందసురిగి, యింటికి రాదు //మాకొద్దీ//

17. చిత్తరంజన దాసు చిన్నారు కొమరుని
చెయి విరచి చెర బెట్టినాడు
అతని పెత్తనంబును బట్టినాడు!
వారి ముత్తైదువుల
పట్టినాడు!
వాడి సొత్తుకు నిలమీద
చోటు లేదన్నాడు //మాకొద్దీ//

18. మా చీరాలను యిప్డు చేరినాడు
చూచి సిగ్గును పొందబోడోయి!
ఇంక
బీరాలు పలుకుతాడోయి!
మాదు సారము గ్రహియింపడోయి!
వాడి దూరాలోచనమెల్ల
ధూళిలో కలిసింది //మాకొద్దీ//

19. వాటి తాతగారి ముల్లె దాచిపెట్టినయట్లు
ధాటీ చేస్తా డీ దేశమున!
పో రాడా మాడ్తాడాపైన,
మో మోటము పడడు సుంతైనా
వాడి పాటుపాడై పోను
మాట చెపితే వినడు //మాకొద్దీ//

20. తెల్ల దొరల సేవవల్ల బ్రతుకుట
పెద్ద నల్లని మచ్చని యెంచరోయి!
జాతి కల్లా తప్పని యెంచరోయి
దైవ మొల్లడంచు తల్చరోయి
భూమి తల్లీ యేడ్పులు వినరోయి!
వారి యుల్లమెల్ల
సన్నికల్లులై పోయాయి! //మాకొద్దీ//

21. ఎవరి యనుమతిపైనహిందూ దేశమునందు
పరిపాలనము పెట్టినాడు?
వీడు ఎవరికీ జవాబు నీడు
ధర్మ
మార్గము నంటుకొని పోడు
వీడి దారుణత్వముకింక
తగిన యీడే లేదు //మాకొద్దీ//

22. వాడి శాసనాలు మాడిపోను, వాటి గోడియె మాకొద్దు తండ్రి!
ధర్మ
దేవుడె మా రక్ష సుండి!
ప్రజల
ప్రేమయె మాకు దిక్కండి
కష్ట
కాండమె మా పాలు సుండి
ఈ సృష్టి మమ్ము చూచి
సుందరమన నిండి //మాకొద్దీ//

23. దొరల బాధలు మాకు తొలగించుమో తండ్రి
నిరతము నిను గొల్తుమయ్య
!
నీదు చరణధ్యానమె విడువమయ్య
మేము మరువము మా ధర్మమయ్య
మేము ఐకమత్యముతోడ అలరారుతామయ్య //మాకొద్దీ//

24. గుండు పట్టుకొ మమ్ము కూల్చ వచ్చినగాని -
కూర్చున్న చోటుల వీడము!
పాడుకొంటూ రాట్నం త్రిప్పుతాము
రాజ్యసూత్రము వడి, వడుకుతాము!
దేవ
శాంతిని తప్పము సంతసం విడువము //మాకొద్దీ//

25. దేశభక్తులనెల్ల దోషు లంచును పెద్ద
మోసగాండ్రని యెంచుతాడు
శాంతి నాశకులని పిలుచుతాడు
దొంగలతో సరిగ
మము చూచుతాడు!
వాడి వూసు యెట్టిదొ కాని
చూచి యోర్వలేడు //మాకొద్దీ//

26. బ్రాహ్మణా బ్రాహ్మణపంచమ బ్రాహ్మణ
భేదపు తెగలు మీకేల?
మీ భేదాలు వడి కాల్పరేల
!
చెడ్డ బోధలకు లొంగిరేల?
యీ మాధుకరపు వృత్తి మరగినారది యేల? //మాకొద్దీ//

27. ఎవరెన్ని చెప్పిన హిందూదేశవాసు లేక సోదరులె సుండీ
అంటూ దోషము మాకు లేదండీ
పాపమంటూ చాటుదాము రండీ
ఈ కుంటి వాదనలు
గూటిలో పెట్టండి //మాకొద్దీ//

28. స్నానధ్యానము చేసి రామ కృష్ణ యంచు -
దేవుడి గుడిలోకి రండీ
అభి షేకమతనికి చేయండి
నిర్మలత్వ
మాత్మను పొందండి
ధర్మ
మార్గమును తగిలి, మాలలూ రండి //మాకొద్దీ//

29. జయము నపజయమును త్రాసులోపల పెట్టి -
చక్కగ తూస్తామంటారు
ధర్మమె జయమని నమ్ముతారు
దైవ
నైజము గుర్తెరుగలేరు
పప్పు భోజనం కోసము
పుట్టామనుకొంటారు //మాకొద్దీ//

30. రాట్నలక్ష్మి నవ్వు రంజిల్లు మోముతో
పాడుచున్నది నోటి నిండా
కరవు మాడుచున్నది దాని యెండా
స్వేచ్ఛ
తిరుగుచున్నది దానిగుండా
ఆ దొరల
తేజంబెల్లతూల్చే జండా యుండా //మాకొద్దీ//

31. ఎన్ని జన్మములందు ఏమి నేరము చేసి -
కన్నుగానక తిరిగినామొ
ప్రజల
అన్నమెల్లను క్రుమ్మినామొ
దైత్యుల
కన్న చెడ్డగ మెలగినామొ
నేడు దున్నలవలె నిట్లు
దొరకితిమి దొరలకు //మాకొద్దీ//

32. ప్రాపంచమెల్లను పట్టి పిండేటంత పశుబలము వాడికుందంట
దాన వశ పరచుతాడు మమ్మంట
మమ్ము కసిదీర కొట్టుతాడంట
వాడి శషభిషలెల్లను చెపుతాడు మా యింట //మాకొద్దీ//

33. స్వచ్ఛతేజముతోడస్వేచ్ఛావధూమణి -
కారాగృహమున వేచియుంది
పూలగుచ్ఛములను దాల్చియుంది
మీకు ముచ్చటలను తెల్పుతుంది
యీ చచ్చు రాజ్యము వీడి సరిగ
జైలుకు రండి! //మాకొద్దీ//

34. విచ్చలవిడిగాను విప్పి రెక్కలు మీరు -
విహరింపవచ్చు మీరచట
స్వేచ్ఛ
నిచ్చ నెక్కగ వచ్చు నచట
దైవం మెప్పులందగవచ్చు నచట
తల్లి కచ్చియున్న రుణము నర్పింపగా వచ్చు //మాకొద్దీ//

35. సకల దేశములారసత్యవర్తనతోడ
సారించు డిటుల మీ దృష్టి
యింక
కనుడి హైందవ పుష్టి
వేగ
తెరవు దొరకుట క్రొత్త సృష్టి
ఎట్టి దండన
లెదురైనకాదు మాకు నష్టి //మాకొద్దీ//

36. ధర్మపక్షము నేడు దారుణమైనట్టి బడలిక పాలయ్యె నయ్య
దాని వదలించుకొనలేదయ్య
నీదు పదునగు ధారనీవయ్య

నీదు పదములపై వ్రాలి ప్రార్థించినామయ్య //మాకొద్దీ//

37. ప్రపంచమున శాంతి ప్రేమ దీపంబులు వెలిగించె నీ దేశమంత
గాంధి తెనిగించె నీ క్రొత్త వ్రాత
స్వేచ్ఛ మొలిపించె మన శక్తి చేత
బలము దుర్బలమను భేదమెచ్చట లేదు //మాకొద్దీ//
38. మా పాపమునెల్ల బాపి రక్షించుమా పాపనాశన! ధర్మమూర్తీ
యిటుల
కోపముంచకు న్యాయమూర్తీ
ఆపదల
బాపుమో చక్రవర్తీ
నీ వ్యాపారమొకసారి
నెరపుము పృథ్విపై //మాకొద్దీ//

39. దీనుల పాలిటి తేజమవీవని వీనులారగ నేను వింటి
కోటి దీనుల
మా భూమికంటె
మము సమాన
యుగముగ చూడుమంటి
మా ప్రాణాలైన
నోర్చి మాన మిమ్మంటి //మాకొద్దీ తెల్లదొరతనము//

* * * * *

2 comments: