ఇవాళో ఎప్పుడో చదివిన కథలోది ఒక శ్లోకం గుర్తొచ్చింది, కానీ కథ పూర్తిగా గుర్తు రాకుండా బాధపెడుతోంది. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకుందురూ…
"పూర్వకాలంలో భుక్కుండుడనే కవి ఉండేవాడు. ఎందుకోగాని ఆయన్ని రాజభటులు పట్టుకున్నారు. రాజుగారి సమక్షంలో విచారణ జరిగింది. రాజు మరణశిక్ష విధించాడు. వేరే తప్పించుకునే మార్గం కనబడక కవి ఇలా అన్నాడు
‘ఓ రాజా. నాల్రోజుల క్రితమే భట్టి మరణించాడు. ఆ మరుసటిరోజు భారవి మరణించాడు. మొన్న భిక్షువు ఒకడు చనిపోయాడు. నిన్న భీమసేనుడనేవాడు పోయాడు. భుక్కుండుణ్ణి నేను. ఇవాళ నా చావుకొచ్చింది. చూస్తూ ఉంటే భ గుణింతంలో యముడు తిష్ఠ వేసుకుని కూచున్నాడు అనిపిస్తోంది. నువ్వు భూపతివి. కాబట్టి నా తర్వాత రేపు నీ వంతే సుమా.’
ఆ దెబ్బకి రాజుగారు హడిలిపోయి ఈ ‘భ’ గుణింతానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అనుకుని భుక్కుండుణ్ణి వదిలేశాట్ట." My comment: బాగుంది.
ఇది మహీధర నళినీ మోహన్ గారు వ్రాసిన కథ. “తరతరాల కథలు” అనే పుస్తకంలో ఉంది. భట్టి అనే మహా పండితుడి మరణంతరువాత ఆ గురుకులంలోని విద్యార్థులందరూ చెరోదిక్కు వెళ్ళిపోతారు. అందులో భుక్కుండుడనే వాడొకడు. మంద్రా నదీ తీరంలోను వలభీ నగర రాజైన శ్రీధరసేనుని దర్శనార్థం వెళ్ళిన అతనిపై రాణిగారి నగలను దొంగిలించిన నేరం ఆపాదించి ఉరి శిక్ష విధిస్తారు. అప్పుడు తన యుక్తిని ఉపయోగించి పై శ్లోకం చెప్పి యముడు ’భ’ గుణింతం గుణిస్తున్నాడని, భుక్కుండుని తరువాత వంతు భూపతి దని చెప్పి చావు తప్పించుకొంటాడు.
ఇవాళో ఎప్పుడో చదివిన కథలోది ఒక శ్లోకం గుర్తొచ్చింది, కానీ కథ పూర్తిగా గుర్తు రాకుండా బాధపెడుతోంది. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకుందురూ…
ReplyDelete"పూర్వకాలంలో భుక్కుండుడనే కవి ఉండేవాడు. ఎందుకోగాని ఆయన్ని రాజభటులు పట్టుకున్నారు. రాజుగారి సమక్షంలో విచారణ జరిగింది. రాజు మరణశిక్ష విధించాడు. వేరే తప్పించుకునే మార్గం కనబడక కవి ఇలా అన్నాడు
భట్టిర్నష్టః భారవిరపి నష్టః
భిక్షుర్నష్టో భీమసేనో2పినష్టః
భుక్కుండో2హం భూపతిస్త్వంహి రాజన్
భభ్భావళ్యామన్తకస్సన్నివిష్టః ||
సొంతపైత్యపు అనువాదం -
‘ఓ రాజా. నాల్రోజుల క్రితమే భట్టి మరణించాడు. ఆ మరుసటిరోజు భారవి మరణించాడు. మొన్న భిక్షువు ఒకడు చనిపోయాడు. నిన్న భీమసేనుడనేవాడు పోయాడు. భుక్కుండుణ్ణి నేను. ఇవాళ నా చావుకొచ్చింది. చూస్తూ ఉంటే భ గుణింతంలో యముడు తిష్ఠ వేసుకుని కూచున్నాడు అనిపిస్తోంది. నువ్వు భూపతివి. కాబట్టి నా తర్వాత రేపు నీ వంతే సుమా.’
ఆ దెబ్బకి రాజుగారు హడిలిపోయి ఈ ‘భ’ గుణింతానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అనుకుని భుక్కుండుణ్ణి వదిలేశాట్ట."
My comment:
బాగుంది.
దీనిపై చంద్రమోహన్ రెస్పాన్సు:
ReplyDeleteఇది మహీధర నళినీ మోహన్ గారు వ్రాసిన కథ. “తరతరాల కథలు” అనే పుస్తకంలో ఉంది.
భట్టి అనే మహా పండితుడి మరణంతరువాత ఆ గురుకులంలోని విద్యార్థులందరూ చెరోదిక్కు వెళ్ళిపోతారు. అందులో భుక్కుండుడనే వాడొకడు. మంద్రా నదీ తీరంలోను వలభీ నగర రాజైన శ్రీధరసేనుని దర్శనార్థం వెళ్ళిన అతనిపై రాణిగారి నగలను దొంగిలించిన నేరం ఆపాదించి ఉరి శిక్ష విధిస్తారు. అప్పుడు తన యుక్తిని ఉపయోగించి పై శ్లోకం చెప్పి యముడు ’భ’ గుణింతం గుణిస్తున్నాడని, భుక్కుండుని తరువాత వంతు భూపతి దని చెప్పి చావు తప్పించుకొంటాడు.
By: చంద్ర మోహన్ on August 12, 2011
at 9:22 am
ఇది కూడ బాగుందికదూ.